మల్కన్‌గిరి: జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఆహార సరఫరా, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్రో సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆయన జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి అనంతరం ఈ సమావేశానికి హాజరయ్యారు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవినీతిపరులపై కఠన చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. రేషన్ కార్డు కోసం 6.8 లక్షల మంది దర ఖాస్తు చేసుకున్నారని, అర్హులకు కార్డులు అందేలా బ్లాక్ స్థాయిలో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి నివాసయోజన కింద అర్హుల ఎంపికకు సర్వే నిర్వహించాలన్నారు. సమావేశంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మట్కమి, మల్కన్‌గిరి కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సమరి టంగులు, జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రదన్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేష్ చంద్ర సాబర తదితరులు పాల్గొన్నారు.
పొర్జిశీల గ్రామంలో నీటి ఎద్దడి
రాయగడ: జిల్లాలోని కాసీపూర్ సమితి పొర్జిశీ ల గ్రామంలో మంచినీటి కొరత తలెత్తడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. తమ గ్రా మానికి నీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలక్టర్ ఫరూల్ పట్వారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో 30 కుటుంబాలకు చెందిన వంద మందికి పైగా నివసిస్తున్నామన్నారు. గ్రామంలో ఉన్న ఏకై క బోరింగు మరమ్మతులకు గురైందని.. దీంతో నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోయారు. సమస్యను పరిష్కరించి తమ కష్టాలు తీర్చాలని కలెక్టర్‌కు విన్నవించారు. వినతిపత్రం సమర్పించిన వారితో పీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండా కూడా ఉన్నారు.
ప్రఫుల్ల కుమార్ పండాకు
ఇస్రో ఐఐఆర్‌ఎస్ ఆవార్డు
పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ డాక్టర్ ప్రఫుల్లకుమార్ పండాకు ఉత్తమ ఐఐఆర్‌ఎస్. డి.ఎల్.పి.కోఆర్డినేటరు ఆవార్డును ఇస్రో సంస్థ డెహారాడూన్‌లో అందుకున్నారు. ఈ ఆవార్డు ను ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎ.కె.కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నట్టు డాక్టర్ ప్రఫుల్ల కుమార్ పండా తెలిపారు. దేశవ్యాప్తంగా 3,800 మంది ఈ ఆవార్డుకు దరఖాస్తు చేసుకోగా వారిలో 22 మంది కోఆర్డినేటర్లు ఎంపిక అవ్వగా చివరికి ముగ్గురు ఆవార్డుకు ఎంపికయ్యారు. ప్రఫుల్ల కుమార్ పండా స్పేస్ టెక్నాలజీ , జియాస్సెషల్ అప్లికేషన్‌పై ఆయన పరిశోధనకు ఈ ఆవార్డు లభించింది. డాక్టర్ పండా గతంలో ఇస్రోలో కొన్నేళ్లు పనిచేసి మానేవేశారు. ఇస్రో సంస్థ తరఫున ఆవార్డు పొందినందుకు సెంచూరియన్ వర్సిటీ చైర్మన్ డాక్టర్ ముక్తికాంత మిశ్రా, ఉపాధ్యక్షులు అచా ర్య డి.ఎన్.రావు, ఉపకులపతి డాక్టర్ సుప్రియా పట్నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్ర్‌లు అభినందనలు తెలియజేశారు.
డంపింగ్ యార్డును తరలించండి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా కేంద్రంలోని డంపింగ్ యార్డుని వేరే ప్రాంతానికి తరలించాలని సచేతన నాగరిక మంచ్ డిమాండ్ చేసింది. శుక్ర వారం కొరాపుట్ మున్సిపాలిటీ కార్యాలయంలో మంచ్ సభ్యులతో మున్సిపల్ యంత్రాంగం చర్చలు జరిపింది. పట్టణంలోని 10వ వార్డులో అశోక్ నగర్‌లో ప్రస్తుతం డంపింగ్ యార్డు ఉంది. అందులో పట్టణంలో వ్యర్ధాల తో పాటు వైద్య కళాశాల వ్యర్ధాలు వేస్తున్నారు. దాంతో ఆ ప్రాంతం అంతా దుర్గంధంతో పాటు పొగలు అలుముకుంటున్నాయి. దీనిని తరలించక పోతే మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మంచ్ హెచ్చరింది. దాంతో మున్సిపల్ చైర్మన్ లలెటెందు రంజన్ శెఠి జోక్యం చేసుకొని మంచ్ సభ్యులతో చర్చలు జరిపారు. యార్డుని వేరే చోటుకు తరలించడానికి అధికారులు అంగీకరించారు. మాజీ ఎమ్మెల్యే నిమయ్ సర్కార్, రుపక్ తురుకు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై సమీక్ష
అభివృద్ధి పనులపై సమీక్ష