శభాష్‌ స్మృతి | - | Sakshi
Sakshi News home page

శభాష్‌ స్మృతి

Jun 14 2023 7:20 AM | Updated on Jun 14 2023 7:27 AM

- - Sakshi

కొరాపుట్‌ జిల్లా కేంద్రానికి చెందిన స్మృతి సుధా సాహు భువనేశ్వర్‌లో ఉన్నత విద్యను అభ్యనిస్తూ

ఒడిశా: కేన్సర్‌ రోగుల కోసం తన పొడవైన జట్టును దానంచేసి కొరాపుట్‌కు చెందిన యువతి ఔదార్యాన్ని చాటుకుంది. కొరాపుట్‌ జిల్లా కేంద్రానికి చెందిన స్మృతి సుధా సాహు భువనేశ్వర్‌లో ఉన్నత విద్యను అభ్యనిస్తూ, సివిల్స్‌ కోసం శిక్షణ పొందుతోంది. ఇటీవల కేన్సర్‌ పీడిత మహిళల సమస్యలు ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి. కేన్సర్‌ మహిళా రోగులకు కీమోథెరఫీ నిర్వహించిన తర్వాత జట్టు ఊడిపోతుంది. దీంతో వారికి విగ్గు అవసరం ఏర్పడుతుంది.

ఇలాంటి మహిళల కోసం సోప్వ అనే స్వచ్ఛంద సంస్థ మహిళల నుంచి జట్టును విరాళంగా సేకరిస్తుంది. దీంతో వెంటనే కేన్సర్‌ పేషెంట్లకు కనీస తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో స్మృతి ఆ సంస్థను సంప్రదించింది. సన్నిహితులు, సహచర విద్యార్థుల సమక్షంలో తన జట్టును విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒడిశాలో సుమారు 50 వేల మంది కేన్సర్‌ బాధితులు ఉన్నారన్నారు. చికిత్స సమయంలో జుట్టు రాలిపోతే మానసికంగా వేదనకు గురవుతారని పేర్కొన్నారు.

అలాంటి వారికి జట్టు ఇవ్వడం వలన వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన నిర్ణయం తల్లిదండ్రులకు చెబితే సగం జుట్టు కంటే, పూర్తిగా ఇవ్వాలని సూచించి మద్దతు తెలిపారని ఆనందం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement