బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎఫ్‌ఓ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎఫ్‌ఓ

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎఫ్‌ఓ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): విజయవాడ దుర్గమ్మ ఆలయ దసరా ఉత్సవాల చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌గా ద్వారకా తిరుమల ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. దేవదాయ శాఖలో ఆయన ఆర్జేసీ హోదాలో కొనసాగుతున్నారు. సోమవారం చోటు చేసుకున్న వివాదాలు, దసరా ఉత్సవాల ఏర్పాట్లలో ఇబ్బందులు, ప్రముఖ వ్యక్తికి సరైన దర్శనం కలిగించకపోవటం వంటి అంశాలతో ఇప్పటి వరకూ చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌గా పని చేసిన దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. సోమవారం బాధ్యతలు స్వీకరించిన త్రినాథరావు ఆలయంలోని ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లు, ప్రసాదాలు, అన్నదానం తదితర అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement