వైద్య శిబిరాల్లోని సిబ్బందికి డీఎంహెచ్‌ఓ సూచన
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా మహోత్సవాల్లోని వైద్య శిబిరాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిరతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు అన్నారు. ఆయన ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన ప్రధమ చికిత్సా కేంద్రాలను సోమవారం తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కొండపైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు తక్షణ సహాయం కోసం ఏర్పాటుచేసిన మూడు పడకల ఆసుపత్రిని, చినరాజు గోపురం వద్ద ఏర్పాటుచేసిన ప్రథమ చికిత్స కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది విధుల నిర్వహణ, ప్రథమ చికిత్స ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం వైద్య సేవలు అందించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, దసరా మహోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.


