మాదకద్రవ్యాల నివారణకు ప్రజల సహకారం అవసరం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల నివారణకు ప్రజల సహకారం అవసరం

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

మాదకద్రవ్యాల నివారణకు ప్రజల సహకారం అవసరం

ఈగల్‌ ఐజీపీ రవికృష్ణ

పెనమలూరు: మాదకద్రవ్యాల నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఈగల్‌ ఐజీపీ ఆకే.రవికృష్ణ అన్నారు. యనమలకుదురు కాలువ కట్టపై మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా సోమవారం ఆపరేషన్‌ త్రిశూల్‌లో భాగంగా మెగా కార్డన్‌ ఆండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల విషయంలో సమాచారం తెలిసిన ప్రజలు మౌనంగా ఉండకుండా వెంటనే సంప్రదించి పోలీసులకు సమాచారం ఇవ్వలన్నారు. 1972 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. ప్రజలు భాగస్వాములైతేనే ఆశించిన ఫలితాలు సాధించగలుగుతామని వివరించారు. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ ఆపరేషన్‌ త్రిశూల్‌తో మాదకద్రవ్యాల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారన్న అనుమానంతో 100 మందికి డ్రగ్‌ పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఈగల్‌ ఎస్పీ కె.మహేశ్వరరాజు మాట్లాడుతూ కరటక్ట ప్రాంతంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేశామన్నారు. అనుమానం ఉన్న వ్యక్తులకు కౌన్సిలింగ్‌ చేశామని తెలిపారు, పాజిటివ్‌ వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా పోలీసులు గ్రామంలో అనుమానాస్పద ప్రాంతాల్లో విసృతంగా పర్యటించి తనిఖీలు చేశారు. ప్రజలకు పోలీసుల సహాయం అవసరమైతే వెంటనే 112 కి ఫోన్‌ చేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఈస్ప ఆళ్ల జయకృష్ణ, ఈగల్‌ సీఐలు ఎం.రవీంద్ర, డి.నాగార్జున, పెనమలూరు సీఐ నామాల వెంకటనారాయణ, ఎస్‌ఐలు సుధాకర్‌, భవానీ, జిల్లా డాగ్‌ స్క్వాడ్‌, ఈగల్‌ సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement