సన్న బియ్యం అమ్మకాల కౌంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

సన్న బియ్యం అమ్మకాల కౌంటర్‌ ప్రారంభం

Oct 13 2026 1:47 AM | Updated on Oct 13 2026 1:47 AM

సన్న బియ్యం అమ్మకాల కౌంటర్‌ ప్రారంభం తిరుమలకు 10 టన్నుల కూరగాయలు సరఫరా నెలలు నిండకుండా పుట్టిన శిశువుకు అరుదైన వైద్యం

భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ భవానీపురం రైతుబజార్‌లో బీపీటీ సన్నబియ్యంతోపాటు కెఎన్‌ఎమ్‌/ఆర్‌ఎన్‌ఆర్‌ రకం సన్నబియ్యం అమ్మకాల కౌంటర్‌ను రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సోమవారం ప్రాంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ సన్న బియ్యాన్ని కిలో రూ.49కు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనంగా సన్న బియ్యాన్ని రూ.50కు 26 కేజీల బ్యాగును అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే గోధుమ పిండి కిలో రూ.25కే అందుబాటులోకి తీసుకువచ్చామని, రైతుబజార్ల ద్వారా కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కందిపప్పు, పామాయిల్‌ కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ కమిషనర్‌ కన్నబాబు, జేసీ ఇలక్కియ, డీఎస్‌ఓ వాణి, డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సతీష్‌, సివిల్‌ సప్లయిస్‌ డిప్యూటీ తహిసీల్దార్‌ పి.శ్రీనివాస్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్‌, కూటమి నాయకులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): తిరుమలలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి ది కృష్ణాజిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు సరఫరా చేశారు. ఈ మేరకు బెంజిసర్కిల్‌ సమీపంలోని అసోసియేషన్‌ హాలు వద్ద కూరగాయలతో కూడిన లారీకి సోమవారం సంఘ అధ్యక్షుడు నాగమోతు రాజా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడ వీర వెంకట సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, ఫౌండేషన్‌ అధ్యక్షులు రావి గోపాలరావు, సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): గర్భం దాల్చిన 26 వారాలకే అత్యవసర పరిస్థితుల్లో డెలివరీకి దారితీయగా, 800 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు ఎలాంటి లోపాలు లేకుండా ఎదిగేందుకు పట్టుదలతో వైద్యం చేసినట్లు అక్కినేని ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ అక్కినేని మణి తెలిపారు. విజయవాడలోని ఆస్పత్రిలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గర్భాశయ ముఖద్వారం బలహీన పడటం వలన 26 వారాలకే గర్భిణికి అత్యవసర డెలివరీకి దారితీసిన వైనాన్ని వివరించారు. పొత్తికడుపు నొప్పులతో, గర్భాశయ ద్వారం అప్పటికే తెరుచుకున్న స్థితిలో ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని డాక్టర్‌ సౌమ్య, డాక్టర్‌ నారాయణ పరీక్షించినట్లు తెలిపారు. కాగా అప్పటికి నాలుగు వారాల ముందు ఇదే పరిస్థితి వస్తే సర్విక్స్‌కు కుట్లు వేశామని, మళ్లీ అదే సమస్య తలెత్తడంతో మళ్లీ కుట్లు వేడయం సాధ్యం కాని పరిస్థితిలో అత్యవసర డెలివరీ చేసినట్లు వివరించారు. దీంతో 800 గ్రాములతో పుట్టిన శిశువుకు అరుదైన చికిత్సతో ఆరోగ్యంగా ఎదిగేలా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో చికిత్స చేసిన వైద్య బృందం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement