వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలకు పోలీసుశాఖ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రాష్ట్రం హోం మంత్రి అనిత సోమవారం పరిశీలించారు. 30 అధునాతన డ్యాష్ బోర్డుల ద్వారా ఏఐ, డ్రోన్లు– ఏఎన్‌పీఆర్ ద్వారా క్యూలైన్లలో భక్తుల కదలికలు, రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో పర్యవేక్షణ చేస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. 70కి పైగా అనలైటికల్ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు షిరీన్‌బేగం, జి.సరిత తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులకు చిన్నారిని అప్పగింత..
కర్నూలు జిల్లా, జొన్నగిరి ప్రాంతానికి చెందిన తనుశ్రీ అనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చి క్యూ లైన్ వద్ద అనుకోకుండా తన తల్లిదండ్రుల నుంచి విడిపోయింది. పోలీస్ సిబ్బంది ఆ పాపను గుర్తించి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. చిన్నారి ఇచ్చిన సమాచారంతో ఆమె తల్లిదండ్రులను సంప్రదించి క్షేమంగా అప్పగించారు.


