ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

● జిల్లాలోని 32 కేంద్రాల్లో పరీక్ష రాసిన 11,345 మంది విద్యార్థులు ● పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించిన కలెక్టర్‌ లక్ష్మీశ

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌–2026 ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 11,496మంది విద్యార్థులను కేటాయించగా అందులో 11,345మంది విద్యార్థులు హాజరవగా.. 98.69 శాతం నమోదైందని అధికారులు తెలిపారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షకు జిల్లాలో 32 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఈ పరీక్షను నిర్వహించారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పరీక్ష కొనసాగింది. విద్యార్థులను 11.00 గంటల నుంచి పరీక్ష జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రాల ప్రధాన ద్వారాలను మూసివేశారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌తో పాటుగా ఇతర గుర్తింపు కార్డుల ఉంటేనే లోపలకు అనుమతించారు. పొడవాటి దుస్తులు, బూట్లు, నగలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను పరిశీలించి అభ్యర్థులను లోపలకు అనుమతించారు. అనంతరం విద్యార్థులు బయోమెట్రిక్‌ పరిశీలన చేసి ఆ తదుపరి పరీక్ష గదిలోకి అనుమతించారు.

సందడి వాతావరణం..

విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయా పరీక్ష కేంద్రా ల పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. వారి వాహనాలతో పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. మధ్యా హ్నం 1.30 గంటల వరకూ విద్యార్థుల తల్లిదండ్రులు గేట్ల వద్దనే నిలిచి ఉన్నారు. స్థానిక పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించటంతో పాటుగా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూశారు.

Advertisement
 
Advertisement
Advertisement