జీజీహెచ్‌లో డెలివర్రీ
కాన్పుల కోసం నాలుగు జిల్లాల నుంచి వస్తున్న గర్భిణులు గర్భిణులు, బాలింతలకు జీజీహెచ్‌లో బెడ్‌లు చాలక సతమతం పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయని వైనం
ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక..
గర్భిణుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
ప్రభుత్వానిదే బాధ్యత
లబ్బీపేట(విజయవాడతూర్పు): చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం నిండు గర్భిణుల పాలిట శాపంగా మారింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అరకొరగా మాత్రమే ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి పురిటి నొప్పులతో గర్భిణులు విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వస్తు న్నారు. దీంతో జీజీహెచ్‌పై భారం పెరుగుతోంది. ఒక్కొక్కసారి పడకలు చాలక ఒకే బెడ్‌పై ఇద్దరు గర్భిణులు, బాలింతలు ఉండాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంటోంది. అందుకు వైద్యులు, వైద్యాధికారుల తప్పిదం ఏమీ లేకున్నా, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణంగా నిలుస్తోంది. ఇతర ప్రసూతి ఆస్పత్రులను నిర్లక్ష్యం చేయడంతో అందరూ జీజీహెచ్‌కు వస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది.
నాలుగు జిల్లాలకు పెద్దదిక్కు
విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) ప్రసూతి విభాగానికి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు జిల్లాల నుంచి గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. వీరిలో కొందరు ఇక్కడే గర్భిణిగా ఉన్న సమయంలో మందులు వాడే వారు ఉంటుండగా, మరికొందరు అత్యవసరంగా ఇతర ఆస్పత్రుల నుంచి రిఫర్ చేసిన వారు ఉంటున్నారు. అంతేకాదు తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి ఆస్పత్రుల నుంచి సాయంత్రం అయితే చాలు గర్భిణుల పరిస్థితి కొద్దిగా క్రిటికల్‌గా ఉన్నా విజయవాడకు తరలించేస్తున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చినా సాధారణ ప్రసవం జరుగుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు.
గత ప్రభుత్వంలో మూడు యూనిట్లు పెంపు
ప్రసూతి విభాగంలో ఒకప్పుడు మూడు యూనిట్లు ఉండేవి. ఒక్కో యూనిట్‌కు 30 పడకల చొప్పున 90 పడకలు అధికారికంగా ఉండేవి. అవి చాలక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో గత ప్రభుత్వంలో మరో మూడు యూనిట్లు మంజూరు చేసింది. ఫలితంగా అదనంగా 90 పడకలు పెరగడంతో పాటు, వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెరిగారు. దీంతో ప్రస్తుతం ఆరు యూనిట్లు ఉండగా 180 పడకలు అధికారికంగా ఉన్నాయి. లేబర్ రూమ్‌లో మరో 20 పడకలు ఉన్నాయి. అనధికారికంగా 225 పడకలు వరకూ ఉన్నాయి. అయినప్పటికీ పడకలు చాలని పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి 250 నుంచి 300 మంది వరకూ గర్భిణులు, బాలింతలతో పాటు, గర్భకోశ వ్యాధులకు గురైన మహిళలు చికిత్స పొందుతుంటారు.
ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రులకు ప్రసవం కోసం వెళితే లక్ష రూపాయలకు పైగా బిల్లు చెల్లించాల్సి వస్తోంది. అంతేకాదు పుట్టిన బిడ్డకు ఎన్‌ఐసీయూలో చికిత్స అవసరం అయితే ఎన్ని రూ.లక్షలు అవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పేదలే కాదు, మధ్యతరగతి ప్రజలు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలకు వెళ్లేందుకు ధైర్యం చేయడం లేదు. సాధారణ ప్రసవాలు, సిజేరియన్‌లను ఆరోగ్య శ్రీలో చేర్చినా ఒక్క ప్రైవేటు ఆస్పత్రి కూడా ఆ పథకంలో ప్రసవం చేసేందుకు ముందుకు రాక పోవడంతో జీజీహెచ్ పెద్ద దిక్కుగా మారింది. అక్కడికి వెళితే పడకలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతి నియోజకవర్గంలో 50 పడకల ప్రసూతి ఆస్పత్రి ఏర్పాటు చేసి, నిపుణులైన వైద్యులను నియమించాలి. అక్కడే సిజేరియన్, స్కానింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రసవం కోసం పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం మధ్య తరగతి ప్రజలు ప్రసవం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 50 పడకలతో ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్
గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకం ద్వారా పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీలను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. అంతేకాదు డెలివరీ రూమ్స్ ఏర్పాటు చేసి, అత్యాధునిక డెలివరీ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రసవాలు చేసేందుకు అనువైన పరిస్థితిని కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య రంగంపై నిర్లక్ష్య వైఖరి కారణంగా అవన్నీ మూలన పడ్డాయి. అధిక శాతం పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగని పరిస్థితి నెలకొంది. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో కూడా అరకొరగానే జరుగుతున్నాయి. దీంతో జీజీహెచ్‌పై భారం పెరిగింది.
జీజీహెచ్‌లో డెలివర్రీ
జీజీహెచ్‌లో డెలివర్రీ
జీజీహెచ్‌లో డెలివర్రీ


