ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ
ఎన్టీఆర్ జిల్లాలో 4.15 లక్షలకు చేరిన సంతకాలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడంపై ఎన్టీఆర్ జిల్లాలో నిరసన సంతకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సంతకాలు సేకరణ జరగ్గా, ఇంకా ప్రజల నుంచి లభిస్తున్న స్పందనతో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వైద్య కళాశాలలపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. భావి తరాల భవిష్యత్ కోసం వైద్య కళాశాలలు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలంటున్నారు. కాగా శనివారం నాటికి 4.11 లక్షల సంతకాలు సేకరించగా, ఆదివారం సెలవు దినం అయినప్పటికీ మరో 4,820 సంతకాలు సేకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ 4,15,820 సంతకాలు సేకరించినట్లయిది. ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జిల నేతృత్వంలో కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది.
సేకరణ ఇలా..


