ప్రభుత్వం పట్టించుకోలేదు..
రూపాయి, రూపాయి కూడబెట్టి 2007లో ఇక్కడ స్థలం కొనుగోలు చేశా. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తె పెళ్లికి ఈ స్థలం ఉపయోగపడుతుందనే ఆలోచనతో కష్టపడి కొనుక్కున్నాను. కానీ ఇప్పుడెమో ఈ స్థలం మాది కాదంటూ మమ్మల్ని బయటకు తోసేశారు. 20 ఏళ్ల తరువాత ఇప్పుడొచ్చి మా స్థలాలు లాక్కుంటే మా పరిస్థితి ఏమిటి? కూతురు పెళ్లికి ఉపయోగపడుతుందనుకున్న స్థలం పోయింది. నేను ఏమి చేయాలి? మేం అన్యాయంగా ఆక్రమించుకోలేదు. చట్టబద్ధంగా కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. పరిస్థితి ఏమీ అర్థం కావటం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధిస్తోంది.
– వి. ఆనందరావు, జోజినగర్ బాధితుడు


