బాధితులకు న్యాయం చేయాలి
భవానీపురం(విజయవాడపశ్చిమ): జోజినగర్‌లో నివాసాలు కోల్పోయిన 42 కుటుంబాలను విజయవాడ ఎం సీపీఐ నగర కమిటీ ఆదివారం పరామర్శించింది. కమిటీ కార్యదర్శి కాసాని గణేష్ బాబు మాట్లాడుతూ స్థలం కొనుగోలు, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అన్నీ పక్కాగానే ఉన్నా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయడం కిరాతక చర్య అన్నారు. ఇంత అమానుషం జరిగినా.. అధికార పార్టీ నాయకులు బాధి తులకు ధైర్యం చెప్పకపోవడం దారుణమన్నారు.
ప్రజాప్రతినిధులు ముందుకు రావాలి
ఇళ్లు కోల్పోయిన బాధితులను సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పరామర్శించారు. వారు మాట్లాడుతూ ఇళ్ల కూల్చివేత వెనుక అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. నాయకులు పోలారి, గంగా భవానీ(అడ్వకేట్), కె. నాగమణి, కె. కనకదుర్గ, సీహెచ్ పెద్దిరాజు తదితరులు ఉన్నారు.


