సంక్రాంతి పురస్కారాల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం
మధురానగర్(విజయవాడసెంట్రల్): సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న సేవాతత్పరుల సేవలను గుర్తించి ‘సర్వేజనాః సుఖినో భవంతు’ (సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ) ఆధ్వర్యాన సంక్రాంతి పురస్కారాలతో సత్కరించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈస్‌ఎస్ నారాయణ మాస్టారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారాల ఎంపిక కోసం సమాజ సేవ, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, విద్య, వైద్యం, యోగ, కరాటే వంటి వివిధ రంగాలలో ప్రతిభావంతులైన వారు వారి ప్రతిభను, సేవలను గురించి తెలియజేసే సర్టిఫికెట్లు, ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో 4 పాస్ పోర్టు సైజు ఫొటోలను దరఖాస్తుకు జత చేసి ఈనెల 25వ తేదీ లోపు ‘సర్వేజనాః సుఖినో భవంతు’ డోర్ నం. 1–20–164, పోస్టు, తిరుమలగిరి, గోకుల్‌నగర్, వెంకటాపురం, సికింద్రాబాద్–15 కు పంపించాల్సిందిగా సూచించారు. ఎంపిక చేసిన సేవాతత్పరులను వచ్చేనెల 11వ తేదీన హైదరాబాద్‌లో ప్రముఖుల చేతులమీదుగా ప్రతిభా పురస్కారంతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. వివరాలకు 96523 47207 నంబర్‌లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
చిల్లకల్లు(జగ్గయ్యపేట): గ్రామంలోని వైన్‌షాపు సమీపంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. మండలంలోని గౌరవరం గ్రామానికి చెందిన యాకోబు (35) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వైన్‌షాపు సమీపంలో మృతి చెంది ఉండటాన్ని ప్రజలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించటంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.


