కొత్త లేబర్ కోడ్‌లతో భద్రత కరువు
కృష్ణలంక (విజయవాడ తూర్పు): రాజ్యాంగ విరుద్ధమైన, కార్మిక వర్గానికి నష్టదాయకమైన లేబర్ కోడ్‌ల రద్దుకు కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళనలు చేపట్టాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల్‌గౌడ్ పిలుపునిచ్చారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల సందర్భంగా శనివారం లేబర్ కోడ్స్‌పై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ గోపాల్‌గౌడ్ మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అనుగుణంగా కేంద్రం లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందన్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


