నర్సాపూర్ నుంచి వందేభారత్ పరుగులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): కోస్తా ఆంధ్ర, తమిళనాడు మధ్య పగటిపూట ఏసీ ప్రయాణం కోసం వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు చెన్నయ్ సెంట్రల్ నుంచి విజయవాడకే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ భీమవరం, గుడివాడ మీదుగా నర్సాపూర్ వరకు విస్తరించనుంది. నర్సాపూర్ – చెన్నయ్ మధ్య 655 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం 9 గంటల్లోనే పూర్తి చేస్తుంది. ఈ రైలు మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. ఈ రైలును ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటకు నర్సాపూర్ స్టేషన్‌లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించ నున్నారు. చెన్నయ్ సెంట్రల్ – నర్సా పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 17వ తేదీ నుంచి అమలులోకి రానుంది.


