‘వేగ’లో పండుగల ఆఫర్లు
లబ్బీపేట(విజయవాడతూర్పు): రానున్న ధనుర్మాసం, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని వేగ జ్యూయలర్స్‌లో ప్రత్యేక ఆఫర్లు ప్రవేశ పెట్టారు. ఈ నెల 15 నుంచి అందుబాటు లోకి రానున్న ఈ ఆఫర్ల బ్రోచర్‌ను శనివారం విజయవాడ బృందావన కాలనీ లోని నందమూరి రోడ్డులో ఉన్న వేగ షోరూమ్‌లో మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ లాంఛనంగా ఆవిష్కరించారు. ఆఫర్లలో భాగంగా బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు, పోల్కి ఆభరణాల తయారీ, తరుగు చార్జీలు ఉండవని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 ఉంటుందని, అందరూ ఈ అద్భుతమైన ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


