పురిటి నొప్పులు
న్యూస్‌రీల్
ఇప్పటికే ఒక ఆస్పత్రి మూత, మూడింటిలో వైద్యులు లేక అవస్థ ఆస్పత్రుల్లో పనిలేక ఖాళీగా ఉంటున్న శాశ్వత సిబ్బంది సర్దుబాటు చేయకుండా చోద్యం చూస్తున్న వీఎంసీ అధికారులు భారమంతా జీజీహెచ్‌పై పడుతున్న వైనం ప్రసూతి ఆస్పత్రులను నిర్వహించాలనికోరుతున్న నగర ప్రజలు
ఆస్పత్రులను బలోపేతం చేస్తాం
శ్రద్ధచూపని అధికారులు
ఎన్టీఆర్ జిల్లా
ప్రసూతి ఆస్పత్రులకు
విజయవాడకల్చరల్: నగరంలోని బందరురోడ్డులో ఉన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆంధ్ర నాట్య పోటీలు జరిగాయి. పలువురు కళాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
విజయవాడకల్చరల్: నగరంలోని పున్నమ్మ తోటలో ఆదివారం చిత్రకళా సంత జరుగుతుందని తెలుగు ప్రపంచ చిత్రకారుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్‌ఎం పీరన్ శనివారం తెలిపారు.
2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి రెండు నుంచి 12వ తేదీ వరకు 36వ పుస్తక మహోత్సవం జరుగుతుందని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్‌నాయుడు, కె. లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే పుస్తక మహోత్సవం ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఇతర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జన వరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి.లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల సమస్యల పరిష్కారంలో ‘డబుల్ ఇంజిన్’ విఫలం
గన్నవరం: రాష్ట్రంలో రైతుల సమస్యల పరిష్కారంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యల్లమందరావు విమర్శించారు. గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని పలు గ్రామాల్లో శనివారం ఏపీ రైతు సంఘం నేతలు పర్యటించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బస్తాకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంద న్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. వరితో పాటు పత్తికి కూడా మద్దతు ధర రాక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోంథా తుపానుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,500 కోట్ల పంట నష్టం జరి గితే ప్రభుత్వం మాత్రం రూ.వెయ్యి కోట్లుగా ప్రకటించిందన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదని చెప్పారు. అదాని, అంబాని కంపెనీలకు రూ.16,500 కోట్ల రాయితీలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణాలను పూర్తిగా రద్దు చేసి, పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘ నేతలు ముక్కామల ఉమామహేశ్వరరావు, కాట్రగడ్డ రామచంద్రజోషి తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని ప్రసూతి ఆస్పత్రులు అలంకార ప్రాయంగా మిగిలాయి. బిడ్డలకు జన్మ నిచ్చి, దంపతుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఈ ఆస్పత్రుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. వైద్యుల పోస్టు లను భర్తీ చేయకపోడంతో వెలవెలబోతున్నాయి. శాశ్వత సిబ్బంది ఉన్నా వైద్యులు లేక పోవడంతో ఈ ఆస్పత్రుల్లో ఎంతో కాలంలో సేవలు నిలిచిపోయాయి. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నాలుగు ప్రసూతి ఆస్పత్రులు ఉన్నాయి. రాణీగారి తోట ఆస్పత్రి ఇప్పటికే మూతపడింది. కృష్ణలంక, రామరాజ్యనగర్, రాజీనగర్‌లో ప్రసూతి ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతాల గర్భిణులు పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)కి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ఫలితంగా జీజీహెచ్ ప్రసూతి విభాగంపై ఎక్కువ భారం పడుతోంది. చిట్టినగర్‌లోని షేక్ రాజా ఆస్పత్రి కూడా గతంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత దాని బాధ్యతలను సెకండరీ హెల్త్ డిపార్ట్‌మెంట్ తీసుకుంది.
అలంకారంగా మిగిలిన వైనం
రాణీగారితోట సిమెంట్ గోడౌన్ ప్రాంతంలో వంగవీటి మోహనరంగా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొంతకాలంగా అది మూతపడి ఉంది. కృష్ణలంలో యూపీహెచ్‌సీ పక్కనే మరో ప్రసూతి ఆస్పత్రి ఉంది, అక్కడ ఏఎన్‌ఎంలు, హెచ్‌వీ ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే వైద్యులు లేక పోవడంతో సిబ్బంది ఏమీ చేయలేని దయనీయ స్థితి నెలకొంది. ఎవరైనా వస్తే పక్కనే ఉన్న యూపీహెచ్‌సీకి పంపుతున్నారు. అలాంటప్పుడు ఈ ఆస్పత్రి ఉండి ఉపయోగం ఏమిటో అధికారులకే ఎరుక. రామరాజ్యనగర్, రాజీవ్‌నగర్ ఆస్పత్రుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒకప్పుడు రాజీవ్‌నగర్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ఆరోగ్య కార్యక్రమాలకు సిబ్బంది దూరం
ఇప్పుడు నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సచివాలయ హెల్త్ సెక్రటరీలు అందుబాటు లోకి వచ్చారు. హెల్త్ సర్వేలు కూడా వారే చేస్తున్నారు. దీంతో వీఎంసీ ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది పనిలేక ఖాళీగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. సుమారు 12 మంది ఏఎన్‌ఎంలు, నలుగురు హెచ్‌వీలు, ఒక హెల్త్ ఎడ్యుకేటర్, నలుగురు వాచ్‌మన్లు, నలుగురు అటెండర్లు ప్రసూతి ఆస్పత్రుల్లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారు వ్యాక్సినేషన్, పల్స్‌పోలియో వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదని అంటున్నారు. ఒకవైపు వైద్య శాఖలో సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతుంటే, అక్కడ మాత్రం వారిని ఖాళీగా ఉంచి జీతాలు చెల్లిస్తున్నారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. వారిని సర్దుబాటు చేయాలనే ఆలోచనను అధికారులు చేయడం లేదని పేర్కొంటున్నారు. ప్రసూతి ఆస్పత్రులను ప్రారంభించాలని నగరంలోని పేద ప్రజలు కోరుతున్నారు.
రాణీగారితోటలో మూతపడిన ప్రసూతి ఆస్పత్రి భవనం
లబ్బీపేట(విజయవాడతూర్పు): అబద్ధపు ప్రచారంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగిస్తోందని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కరువయ్యా యని పేర్కొన్నారు. గుణదలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో దేవినేని అవినాష్ శని వారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన నూతన వైద్య కళాశాలలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ పిలుపు మేరకు కోటి సంతకాల్లో భాగంగా జిల్లాలో 4.21 లక్షల సంతకాలను ప్రజల నుంచి సేకరించామని తెలిపారు. అక్టోబర్ పదో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని వివరించారు. అన్ని నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి చేరిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తామన్నారు. అందులో భాగంగా విజయవాడ చుట్టుగుంట సెంటర్ నుంచి శిఖామణి సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.
అలా అనడం సిగ్గుచేటు
ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతున్నా డని దేవినేని అవినాష్ మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులు అయితేనే వైద్య కళాశాలల నిర్వహణ బాగుంటుందని ఆయన మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తే, టీడీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు పాలన నేర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అవినాష్ పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా వైస్ జగన్ ప్రభుత్వ పథకాలు ఏవీ ఆపలేదని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి అబద్ధపు ప్రచారాలతో కాలం గడుపుతోందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌ను గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య కళాశాలలపై తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని హితవు పలికారు. ఈ నెల 15న నిర్వహించే ర్యాలీలో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీకి పోలీసుల అనుమతులు ఉన్నాయని తెలిపారు. పోలీసులు కూడా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వీఎంసీ ఫ్లోర్‌లీడర్ వెంకట సత్యనారాయణ, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్లు తాటిపర్తి కొండారెడ్డి, తంగిరాల రామిరెడ్డి, కలపాల అంబేడ్కర్, కో ఆప్షన్ సభ్యుడు ముసునూరు సుబ్బా రావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆళ్ల చెల్లారావు పాల్గొన్నారు.
నగరంలోని ప్రసూతి ఆస్పత్రులను బలోపేతం చేస్తాం. గర్భిణులకు ప్రసూతి సేవలు అందించేందుకు అందుబాటులోకి తెస్తాం. అవసరమైన సిబ్బందిని, వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ అర్జునరావు, సీఎంఓహెచ్, వీఎంసీ
కాన్పులన్నీ ఆస్పత్రుల్లోనే జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే నగరపాలక సంస్థ ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలు అందక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే వేల రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంత ఖర్చు భరించడం పేదలకు కష్టం. దీంతో నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన గర్భిణులు కాన్పుల కోసం జీజీహెచ్‌లోని ప్రసూతి విభాగానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో జీజీహెచ్‌లో విపరీతంగా రద్దీ నెలకొం టోంది. ఎక్కువ మంది రావడంతో సేవల్లో కూడా జాప్యం తప్పడంలేదు. నగరంలోని ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలు అందుబాటులో ఉంటే క్లిష్టమైన కేసులను మాత్రమే జీజీహెచ్‌కు పంపించి, సాధారణ కాన్పులను స్థానికంగానే చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆ దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. దీంతో ప్రసూతి ఆస్పత్రులు నిర్వీర్యంగా మారుతున్నాయి.
పురిటి నొప్పులు
పురిటి నొప్పులు


