షటిల్ డబుల్స్ టోర్నమెంట్ విజేత విజయవాడ జట్టు
నాదెండ్ల: క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు యువత మధ్య స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయని సీఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చుండి రంగనాయకులు అన్నారు. గణపవరం సీఆర్ కళాశాల ఇండోర్ స్టేడియంలో నియోజకవర్గ స్థాయి, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయి షటిల్ డబుల్స్ టోర్నమెంట్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. సీఆర్ కళాశాల షటిల్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్‌లో నియోజకవర్గ స్థాయిలో 30 జట్లు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల స్థాయిలో 40 జట్లు పాల్గొన్నాయి.
మూడు జిల్లాల స్థాయి విజేతలు
మూడు జిల్లాల స్థాయిలో విజయవాడకు చెందిన ధనుష్, చంద్రగోపీ మొదటి బహుమతి కై వసం చేసుకున్నారు. రెండు, మూడు, నాల్గవ బహుమతులు వరుసగా విజయవాడకు చెందిన విజయ్‌సాయిరెడ్డి, పోతురాజు, గణపవరం గ్రామానికి చెందిన జాక్సన్, పృథ్వీ, కోండ్రుపాడు, గణపవరానికి చెందిన ఆదినారాయణ, సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా కొండెపాటి నాగయ్య, రమేష్, నరేంద్ర, గేరా యాకోబు వ్యవహరించారు. కమిటీ సభ్యులు యశ్వంత్‌చౌదరి, సాయిచౌదరి, పట్నంశెట్టి మణికంఠ, నాని, బాషా, ఆదినారాయణ పర్యవేక్షించారు.


