మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై..
సంతకాల సేకరణ ఇలా
ర్యాలీలో పాల్గొనండి
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 4.21 లక్షల సంతకాలు
నియోజకవర్గం సంతకాల సంఖ్య
విజయవాడ తూర్పు 96,123
విజయవాడ వెస్ట్ 65,028
విజయవాడ సెంట్రల్ 60,000
మైలవరం 58,466
తిరువూరు 40,000
నందిగామ 40,000
జగ్గయ్యపేట 61,600
డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ 750
మొత్తం 4,21,967
సాక్షి ప్రతినిధి, విజయవాడ: చంద్రబాబు సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాలపై ప్రజలు నిరసన సంతకం చేశారు. బాబు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను పప్పు బెల్లాల్లా ప్రైవేటుకు అప్పగిస్తారా అంటూ అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజక వర్గ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో విజయవాడ కార్పొరేషన్, నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారు. జిల్లాలోని ఏడు నియోజక వర్గ కేంద్రాల్లో ఈ నెల 10వ తేదీ వైఎస్సార్ సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. అనంతరం సంతకాలు చేసిన ప్రతులను జిల్లా కార్యాలయానికి పంపారు. జిల్లా వ్యాప్తంగా 4,21,967 సంతకాలు చేశారు. జిల్లాలో అత్యధికంగా విజయవాడ తూర్పు నియోజక వర్గంలో నియోజక వర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యాన రికార్డు స్థాయిలో 96,123 సంతకాలు చేశారు. ఇది బిడ్డల ఉజ్వల భవిష్యత్తు అని, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకొనేందుకు తలపెట్టిన ఉద్యమం అని, వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నేతల వెంట పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి జిల్లా వ్యాప్తంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. అక్టోబరు 10న కోటి సంతకాలు సేకరణ ప్రారంభమైంది. రెండు నెలలు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా నిరసన సంతకాలు చేశారు.
నేడు విజయవాడలో భారీ ర్యాలీ
విజయవాడలో చుట్టుగుంట ఈ సేవా సెంటర్ నుంచి శిఖామణి సెంటర్ వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సమర సంతకాలతో సోమవారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, వైఎస్సార్ సీపీ అన్ని విభాగాల నేతలు ర్యాలీలో పాల్గొననున్నారు. శిఖామణి సెంటర్‌లో సభావేదికపై నుంచి నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు. ప్రతులు ఉన్న వాహనానికి నేతలు జెండా ఊపి ప్రారంభించి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు.
చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా
ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన
మాజీ సీఎం వైఎస్ జగన్
కోటి సంతకాలకు ప్రజల
నుంచి భారీ స్పందన
నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా
పార్టీ కార్యాలయానికి చేరిన
సంతకాలు
నేడు జిల్లా కేంద్రం నుంచి భారీ
ర్యాలీతో వైఎస్సార్ సీపీ కేంద్ర
కార్యాలయానికి తరలింపు
విజయవాడలో చుట్టుగుంట ఈ సేవా
కేంద్రం నుంచి శిఖామణి సెంటర్
వరకు భారీ ర్యాలీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై..


