కోర్టు కానిస్టేబుళ్లకు సన్మానం
చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన జరిగిన జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమంలో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించటంతో కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బందిని జిల్లా ప్రధానన్యాయమూర్తి జి. గోపీ సోమవారం ఆయన చాంబర్‌లో ఘనంగా సత్కరించారు. కృష్ణాజిల్లా న్యాయశాఖ సిబ్బంది సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా కోర్టుల్లో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను న్యాయమూర్తి సత్కరించారు. జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎ.వేణుగోపాల్, కార్యదర్శులు సీహెచ్ నరసింహారావు, గోపీనాథ్, ఏవో పి. శ్రీదేవి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం చాలా గొప్పదని, ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగనిరతిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నూతన కౌన్సిల్ 51వ కృష్ణా జిల్లా సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కనకరావు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన జరగనున్న నూతన కౌన్సిల్ సమావేశ నిర్వహణకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యులను కూడా నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లా యూటీఎఫ్ అధ్యక్షుడు ఎండీ షౌకత్ హుస్సేన్, గౌరవాధ్యక్షుడు జె. లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కోర్టు కానిస్టేబుళ్లకు సన్మానం


