శరణు తిరుపతాంబ
పెనుగంచిప్రోలు: ఓం శ్రీఅమ్మయే శరణం తిరుపతాంబ.. ఓం శ్రీస్వామియే శరణం గోపయ్య.. అంటూ పెనుగంచిప్రోలు మార్మోగింది. స్థానిక శ్రీతిరుపతమ్మవారి మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఎదుట ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు, ఆలయ ప్రధానార్చకులు మర్రెబోయిన గోపిబాబు సమక్షంలో ఆలయ అర్చకుడు ముందుగా మాల వేసుకుని ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు మాల వేసుకున్నారు. అర్చకులు వచ్చిన భక్తులకు మాలలు వేశారు. మొదటి రోజు సుమారు 1000మందికి పైగా స్వాములు మాలలు వేసుకున్నారు. మాల వేసుకున్న దీక్షాస్వాములకు సింగరాయకొండకు చెందిన కొత్తకోట వెంకట్రావు ప్రసాదాలు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ రాజు, లక్ష్మణ్, నాగేశ్వరరావు, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో తిరుపతమ్మ
మండల దీక్షలు ప్రారంభం
శరణు తిరుపతాంబ


