ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
గన్నవరం: మండలంలోని చిన్న అవుటపల్లిలో ఉన్న డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో సోమవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాయి మహిళల బాస్కెట్‌బాల్ జట్టును ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్, నర్సింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థినులు ఈ పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన 12మంది విద్యార్థినులను వర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్టులో పిన్నమనేని వైద్య కళాశాల నుంచి నలుగురు, నర్సింగ్ కళాశాల నుంచి ఒకరు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ భీమేశ్వర్ తెలిపారు. హెల్త్ యూని వర్సిటీ క్రీడా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, పీడీ దేవినేని రవి తదితరులు పాల్గొన్నారు.


