కారు, బైక్ ఢీ : ఇద్దరికి గాయాలు
కంచికచర్ల: ముందు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనగా బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గుంటుపల్లికి చెందిన దుర్గా సురేష్‌కుమార్, రమణ అనే మహిళతో కలిసి విజయవాడ వైపు నుంచి తెలంగాణా రాష్ట్రం కోదాడ బైక్‌పై బయలుదేరారు. కంచికచర్ల మండలం కీసర బీజేటీ డిగ్రీ కళాశాల వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో రమణకు తీవ్రగాయాలు, సురేష్‌కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రమణను వైద్య చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్ధితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దుర్గా సురేష్ కుమార్ బైక్ నడిపే సమయంలో హెల్మెట్ ధరించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.


