ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గం ఎన్నికై ంది. సూర్యారావుపేటలోని ఏపీటీఎఫ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ ద్వితీయ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా వి.రాధిక, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా టి.పూర్ణచంద్రరావు, ఎన్.అవని, ఎండీ నయీం అహ్మద్, డి.రాజకుమార్, కార్యదర్శులుగా డి.వసరాం, ఏ సుందరరామారావు, శెట్టిపోగు రాము, షేక్ ఖాజా, షేక్ లాల్‌మద్, రాష్ట్ర కౌన్సిలర్లుగా పీవీ దుర్గా ప్రసాద్, ఎస్‌కే నిఖత్ సుల్తానా ఎన్నికయ్యారు.
పీఆర్సీ కమిషన్ నియమించాలి..
ఎన్నికల అధికారిగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పువ్వాడ వెంకటేశ్వర్లు, పరిశీలకులుగా మక్కెన శ్రీనివాసరావు వ్యవహరించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, ఉపాధ్యక్షులు అనిత మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పని గంటల పెంపు విధానాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు మండాది వెంకటేశ్వర్లు, శోభనాద్రాచార్యులు, వై.భాస్కరరావు, కె.సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.


