పోలీస్ గ్రీవెన్స్‌కు 88 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి 88 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా నడవలేని దివ్యాంగులు, వృద్ధుల వద్దకే నేరుగా వెళ్లి సమస్యను తెలుసుకుని ఫిర్యాదులు అందుకున్నారు. అనంతరం ఆయా స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్స్‌లో భూ వివాదాలు, ఆస్తి తగాదాలపై 44, కుటుంబ కలహాలపై 5, కొట్లాటలపై 4, రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవి 3, మహిళా సంబంధిత నేరాలపై 9, దొంగతనాలపై 7, ఇతర చిన్న వివాదాలు, ఇతర సమస్యలపై 16 ఫిర్యాదులు అందాయి.


