రేటు తగ్గించిన
ప్రజాప్రతినిధి
నియోజకవర్గ ప్రజాప్రతినిధి తన డంపింగ్ యార్డ్‌లో 40 టన్నుల లారీ బూడిదను అన్‌లోడింగ్ చేస్తే గతంలో రూ.4 వేలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3 వేలే ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వద్ద రూ.3,500 ఇచ్చి లోడింగ్ చేసి, రూ.3 వేలకు అన్‌లోడింగ్ ఎలా చేయాలని లారీ ఓనర్లు వాపోతున్నారు. ఏమిచేయాలో దిక్కుతోచక మరలా బూడిద చెరువులో లోడింగ్ పనులు అడ్డుకున్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఏమిచేయాలో తెలియక లోడింగ్ ఆపేశారు. లోడింగ్ చార్జీ చెల్లించి ఇతర ప్రాంతాలకు రవాణాచేసి విక్రయించే ఇతర లారీల ఓనర్లు టీడీపీ వారి ఆగడాలతో ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి హామీ మేరకు నెలకు 12 లారీలకు ఉచితంగా బూడిద లోడు చేయాల్సిందేనని లారీ ఓనర్లు కోరుతున్నారు.


