ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన
గన్నవరం: మోంథా తుపానుకు కృష్ణాజిల్లాలో జరిగిన నష్టంపై ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సోమవారం కేంద్ర బృందం పరిశీలించింది. తొలుత కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్ కె. పొన్నుసామి నేతృత్వంలోని శ్రీనివాసు బైరి, ఆర్తిసింగ్, మనోజ్‌కుమార్ మీనాతో కూడిన కేంద్ర బృందానికి కలెక్టర్ బాలాజీ స్వాగతం పలికారు. అనంతరం తుపాను వల్ల జిల్లాలో దెబ్బ తిన్న వరి పొలాలు, ఉద్యాన తోటలు, ఇళ్లు, పడవలు, రహదారులు, విద్యుత్ స్తంభాల ఫొటోలను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం కేంద్ర బృందం ఏలూరు జిల్లాకు వెళ్లింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, జిల్లా పశుసంవర్ధక అధి కారి చిన్ననరసింహులు పాల్గొన్నారు.


