
15 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
ఇబ్రహీంపట్నం: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి సమ్మె నిర్వహిస్తామని యూనియన్ నాయకులు ప్రకటించారు. ఏపీ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ 129 కార్యాలయం వద్ద శనివారం సమావేశం నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మోదుగు మోహనరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేయాలని, రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి, పీస్ రేటు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్స్ పరిష్కరించని పక్షంలోణీ నెల 14వ తేదీన వర్కు రూల్ పాటించి 15 నుంచి సమ్మె బాట పడతామని చెప్పారు. సమావేశంలో యూనియన్ ఉపాధ్యక్షులు పచ్చిగోళ్ల సుబ్బారావు, వి. రమేష్, కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌కే షంషేర్‌వలి, తన్వికుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.