
దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి సోమవారం పలువురు భక్తులు విరాళాలను అందజేశారు. విశాఖపట్నంకు చెందిన వసంత రామారావు కుటుంబం నిత్యాన్నదానానికి రూ.1,01,700, కంకిపాడుకు చెందిన తుమ్మల చంద్రశేఖర్‌రావు కుటుంబం రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): దీర్ఘకాల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన రిలే దీక్షలు తొమ్మిదో రోజు కొనసాగాయి. రిలే దీక్షల్లో సోమవారం పెద్ద సంఖ్యలో మహిళా వైద్యులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై మహిళా వైద్యులు గళం విప్పారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. కొందరు మహిళా వైద్యులు నినాదాలు, పాటలతో తమ నిరసన తెలిపారు. ప్రభుత్వ వైఖరిపై ప్రదర్శించిన స్కిట్ ఆకట్టుకుంది. ఈ రిలే దీక్షల్లో 500లకు పైగా మహిళా వైద్యులు పాల్గొనడంతో ఆ ప్రాంతం మహిళలో నిండి పోయింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నేతలు డాక్టర్ రవీంధ్రనాయక్, డాక్టర్ వినోద్ మాట్లాడుతూ వైద్యులుగా పనిచేస్తూ ఉద్యోగోన్నతులు, వేతనాలు విషయంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): బాలికల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 18వ తేదీ వరకూ అన్ని శాఖల సమన్వయంలో బాలకల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా పోస్టర్ రూపంలో, వ్యాసరచన పోటీలు, వివిధ రకాల స్లోగన్‌లతో ర్యాలీలు నిర్వహిస్తూ, కమ్యూనిటీ మీటింగ్‌లతో అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబంలోని బాలికల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రామలింగేశ్వరునికి
ప్రత్యేక పూజలు
పెనమలూరు: యనమలకుదురు గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామివారి దేవస్థానంలో సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం 6.40, 9.30, 10.30 గంటలకు రుద్రాభిషేకం చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 5.30 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి 7 గంటలకు పంచహారతులు, స్వామివారికి పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిపించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు

దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళాలు