
మద్యం ఏరులై పారుతోంది..
నిబంధనలకు విరుద్ధంగా గుడి, బడి అన్న తేడా లేకుండా వాటి వద్దే మద్యం దుకాణాలు నడుపుతున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టుషాపులను ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. నాణ్యమైన మద్యం అందిస్తామని మాయమాటల చెప్పిన కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ప్రభుత్వానికి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా కల్తీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలి. ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి.
– అన్నవరపు ఎలిజబెత్‌రాణి,
గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు