వానొచ్చెనంటే...వరదొస్తది! | - | Sakshi
Sakshi News home page

వానొచ్చెనంటే...వరదొస్తది!

Sep 7 2025 7:10 AM | Updated on Sep 7 2025 7:10 AM

వానొచ

వానొచ్చెనంటే...వరదొస్తది!

● వర్షాకాలంలో తీవ్ర ఇక్కట్లు ● పలు గ్రామాలకు నిలుస్తున్న రాకపోకలు ● శిథిలావస్థలో కల్వర్టులు ● వాగులపై వంతెనలు నిర్మించాలి వంతెన నిర్మించాలి రాకపోకలు నిలిచి పోతున్నాయి ● మండల పరిధిలోని ముచ్చింతాల–తాళ్లూరు, పెనుగంచిప్రోలు మధ్య కూచివాగు పొంగుతుంది. తరచూ రాకపోకలు స్తంభిస్తాయి. ● పెనుగంచిప్రోలు–లింగగూడెం మధ్య గండివాగు పొంగుతుంది. చిన్నపాటి వర్షం వచ్చినా వాగు చప్టాపై పెద్ద ఎత్తున వరద నీరు చేరి రాకపోకలు స్తంభిస్తాయి. ● శనగపాడు వద్ద గండి వాగు చప్టా గత ఏడాదితో పాటు ఈ ఏడాది కూడా వరదకు కొంతభాగం కొట్టుకుపోయింది. దీంతో శనగపాడు, వెంగనాయకునిపాలెం, వెంకటాపురం, కొళ్లికూళ్ల, సుబ్బాయిగూడెం ఐదు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించటానికి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ● గుమ్మడిదుర్రు–అనిగండ్లపాడు మధ్యలో దూళ్లవాగు పొంగటంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. ● ముండ్లపాడు గ్రామంలో గండివాగు, కుమ్మరివాగు పొంగి పెనుగంచిప్రోలు–నందిగామ మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.

శనగపాడు నుంచి నందిగామ వెళ్లేందుకు శనగపాడు వద్ద గండివాగు, అనాసాగరం వద్ద మరో వాగు ఉంది. వరదలకు మా గ్రామం వద్ద గండివాగు పొంగి వాగు చప్టా గత ఏడాది, ఈ ఏడాది కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాగుపై వంతెన నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు తొలుగుతాయి.

–కీసర లోకేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు, శనగపాడు

ఏకొద్దిపాటి వర్షమొచ్చినా గండివాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు, రైతులు పొలాలకు వెళ్లలేక పోతున్నారు. వాగు చప్టా వద్ద వంతెన నిర్మించాలి. ఆగస్టు నెలలో మూడు సార్లు వాగు పొంగింది. అధికారులు ఇప్పటికై నా దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలి.

–బరిగెల నాగరాజు, లింగగూడెం

పెనుగంచిప్రోలు: వాగుల వద్ద వంతెనలు లేక మండల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వాగులు ఉధృతంగా ప్రవహించటంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తున్నాయి. మండలంలో వాగులపై చప్టాలు ఉన్నా వర్షాకాలం వాగులు పొంగి చప్టాలపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఏ కొద్దిపాటి వర్షం వచ్చినా వాగుల వద్ద రాకపోకలు నిలిచి పోవటంతో జనజీవనం పూర్తిగా స్తంభిస్తోంది. వాగులు పొంగటంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి. రైతులు తమ పంట పొలాలకు వెళ్లలేరు. ప్రయాణికులు ఎటూ వెళ్లలేక ఇంటికి పరిమితం అవుతున్నారు.

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

వర్షాలకు వాగులు పొంగినప్పుడల్లా ఇవతల గ్రామాల ప్రజలు అటు వెళ్లలేక..అవతల గ్రామాల ప్రజలు ఇటు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. మండల ప్రజలు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క ఆగస్టు నెలలోనే మూడుసార్లు వర్షాలకు వాగులు పొంగి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత నెలలో జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో కొందరు ప్రజాప్రతినిధులు వంతెనల గురించి, రోడ్లు గురించి ఆర్‌అండ్‌బీ అధికారులను ప్రశ్నించారు. అధికారులు అంచనాలు పంపించాం అని చెప్పి ఊరుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుల వద్ద వంతెనలు నిర్మించటంతో పాటు అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

వానలకు పొంగే వాగులు ఇవే

కూలే స్థితిలో కల్వర్టులు

మండలంలో ఎన్నో ఏళ్ల క్రితం వాగులపై నిర్మించిన చిన్నపాటి కల్వర్టులు పూర్తిగా శిథిలమై కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనిగండ్లపాడు ఊరు ముందు దూళ్లవాగుపై కల్వర్టుకు రెండు వైపులా రెయిలింగ్‌ ఊడిపోవటంతో పాటు పూర్తిగా శిథిలమైంది. గుమ్మడిదుర్రు ఊరు ముందు వాగుపై కల్వర్టు వరదలకు పూర్తిగా కుంగిపోవటంతో పాటు తాత్కాలికంగా వేసిన తూములు కూడా వరదకు బయటకు వచ్చాయి. ఈ కల్వర్టుల వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

వానొచ్చెనంటే...వరదొస్తది! 1
1/2

వానొచ్చెనంటే...వరదొస్తది!

వానొచ్చెనంటే...వరదొస్తది! 2
2/2

వానొచ్చెనంటే...వరదొస్తది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement