కృష్ణలంక(విజయవాడతూర్పు): పోలవరం ప్రాజెక్టును డెడ్ స్టోరేజీ ప్రాజెక్టుగా నిధుల విషయంలో కేంద్ర బడ్జెట్‌లో పెట్టిన బిల్లుకు తక్షణమే సవరణ చేయించాలని రాష్ట్ర ఎంపీలను ప్రత్యేక హోదా విభ జన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. లేకపోతే శాశ్వతంగా నష్టపోతా మని ఆందోళన వ్యక్తంచేశారు. గవర్నర్‌పేట బాలో త్సవ భవన్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎనిమిదేళ్ల కిత్రం పోలవరం ప్రాజెక్టు రూ.55 వేల కోట్లకు ఆమోదం పొందితే మొన్న జరిగిన బడ్జెట్‌లో రూ.30 వేల కోట్లకు కుదించడమే కాకుండా 150 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టాన్ని 135 అడుగులకు పరిమితం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం ఇప్పటి వరకు అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సాధన సమితి ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపీ పి.మధు, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, కాంగ్రెస్‌కిసాన్ సెల్ నేత కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆంధ్ర మేధావుల సంఘం నేత ప్రొఫెసర్ విశ్వనాథం, సాధన సమితి సంయుక్త కార్యదర్శి నరసింహారావు పాల్గొన్నారు.