
అమెరికాలోని వైఎస్సార్‌సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
డల్లాస్ లో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. రాంభూపాల్‌రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుత్తూ.. అరాచకానికి కూడా తెరలేపిందన్నారు.
రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. మళ్లి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావటానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్ర శేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి వీర శివా రెడ్డి, కృష్ణ కోడూరు, మణి శివ అన్నపు రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.