
డల్లాస్: అమెరికాలోని డల్లాస్‌లోగల ఫెడరల్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయంలో బుధవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని మీడియా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు వాయువ్య డల్లాస్‌లో ఈ ఘటన చోటుచేసుకోగా, పోలీసులు వెంటనే స్పందించారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ, ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తనను తాను కాల్చుకుని మృతి చెందాడన్నారు. షూటర్ ఘటన జరిగిన సమీపంలోని భవనం పైకప్పుపై మృతి చెందాని మీడియా సంస్థ ఏబీసీ వెల్లడించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు ఆయుధాల వినియోగంలో నిపుణుడై ఉంటాడని విచారణ అధికారులు భావిస్తున్నారు. ఘటనలో గాయపడిన బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నదని కొన్ని మీడియా వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.