సైన్స్ పరికరాలు, స్టడీ మెటీరియల్ అందించిన తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి

Tana Mahasabha Convener Potluri Ravi Provided Science Equipment, Study Material - Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మైక్రోస్కోప్ పరికరాలు, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. విద్యార్థులకు బోధనా పరికరాలు, కంప్యూటర్లు అందించవల్సిందిగా పొట్లూరి రవిని అభ్యర్థించగా వెంటనే స్పందించి మైక్రోస్కోపులు, స్టడీ మెటీరియల్స్ అందించారు. వీటితో పాటే కంప్యూటర్లని కూడా పది రోజుల్లో అందిస్తామని తెలిపారని పాఠశాల బయాలజీ ఉపాధ్యాయుడు గోకారి తెలిపారు.

కప్పట్రాళ్ల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని, పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతికవిద్యను బోధించడానికి కృషి చేస్తామని తానా మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వాసుబాబు గోరంట్ల, రామ్ చౌదరిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, పారిశ్రామికవేత్త అనంత నాయుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు :

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top