కెనడా తెలుగు క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు

Diwali Celebrations Were Held At Canada Toronto Durham Telugu Club - Sakshi

కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నా,పెద్దా అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆడిపాడారు. విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్ ,డిప్యూటీ మేయర్  మలీహా షాహిద్ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన డీటీసీ కార్య సభ్యులను, వాలంటీర్‌లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రూనేర్ అఫ్ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికైన అవంత్ సోలుషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరిని సత్కరించారు. 

డుర్హం తెలుగు  కెనడా క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ..ఖండాంతరాలు దాటినా మన తెలుగు సంస్కృతిని ఇనుమడింప చేసేలా దీపావలి వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు కుటుంబాలకు ప్రత్యక అభినందనలు తెలిపారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top