ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి

Oct 15 2026 8:06 AM | Updated on Oct 15 2026 8:06 AM

ఆర్మూర్‌: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రభుత్వ భూములను తిరిగి ప్రభుత్వ భూములుగా గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని ఏఐయూకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బీ దేవరాం డిమాండ్‌ చేశారు. పట్టణంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తరతరాలుగా భూములపై ఆధారపడి జీవిస్తున్న పేదలు తమ భూములకు సంబంధించిన హక్కులు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురేశ్‌, ఆర్మూర్‌ డివిజన్‌ అధ్యక్షుడు కిషన్‌, నాయకులు ఆర్‌ దామోదర్‌, ఈ రమేశ్‌, పోశన్న, శ్రవణ్‌, సర్పంచ్‌ సాయులు, సేవాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement