● మూడు గేదెలు మాయం
బోధన్: ఎడపల్లి మండల కేంద్రంలో రెండు చోట్ల మూడు గేదెలను దుండగులు అపహరించినట్లు ఎస్సై ముత్యాల రమ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి గ్రామానికి చెందిన యాసాడం రాజ్కుమార్ తన రెండు గౌడు జాతి గేదెలను మేత వేసి, నీరుతాగించి నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి కట్టివేశాడు. దుండగులు గేదెలకు కట్టిన తాడును కోసి వేసి నాలుగు చక్రాల వాహనంలో అపహరించారు. అదేవిధంగా ఇదే గ్రామానికి చెందిన కంజర సుదర్శన్ తన ని వా సం నుంచి ముర్ర జాతి గేదెను కూడా దుండగు లు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


