వేల్పూర్: మండలంలోని వాడి గ్రామంలో జరుగుతున్న భూభారతి రీ సర్వేను ఆర్మూర్ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా బుధవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే అధికారులు జరిపే రీ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. భూమి విస్తీర్ణం హద్దులు తెల్పాలన్నారు. సర్వేతో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. తహసీల్దార్ అనురుద్, వాడి సర్పంచ్ గోలి రమ్య, ఉపసర్పంచ్ గోలి లింబాద్రి, జీపీవో మోహన్, జీపీ కార్యదర్శి రాజేశ్, వీడీసీ సభ్యులు బొడ్డు మల్లేశ్, సాయిరెడ్డి, శివలింగం, గంగారాం, మల్లేశ్, రైతులు పాల్గొన్నారు.


