ముగిసిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు
నిజామాబాద్ అర్బన్: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మినీ గ్రౌండ్లో మూడు రోజుల పాటు కొనసాగిన అండర్ –17 బాలబాలికల రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు బుధవారం ముగిశాయి. ఇందు లో 26 మంది బంగారు పతకాలు సాధించి జాతీ య స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర వి భాగంలో జిల్లాకు చెందిన ఎస్కే అనాస్, హర్ష్, అమన్సింగ్, బాలికల విభాగంలో నిహావైష్ణవి ఎంపికయ్యారు. వీరు ఈనెల 22 నుంచి 26 వరకు జ మ్మూకశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున పాల్గొననున్నారు.
హాకీ పోటీల్లో..
గద్వాల్ జిల్లా అలంపూర్లో నిర్వహించిన అండర్17 బాలుర హాకీ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థులను ఎస్జీఎఫ్ కార్యదర్శి అలివేణి మంగ అభినందనలు తెలిపారు.
రెజ్లింగ్ పోటీల్లో..
నిజామాబాద్ అర్బన్: జిల్లాకు చెందిన క్రీడాకారులు రెజ్లింగ్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి అలివేణి మంగ తెలిపారు. మహబూబాబ్నగర్లో ఇటీవల నిర్వహించిన పోటీల్లో రాష్ట్రస్థాయి అండర్ 14 బాల, బాలికల విభాగంలో జిల్లాకు చెందిన బాల, బాలికలు ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించారు. క్రీడాకారులను ఆమె అభినందించారు.
జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు మనోజ్ఞ
నిజామాబాద్ అర్బన్: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు జయ మనోజ్ఞ అర్హత సాధించినట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శి అలివేణి మంగ తెలిపారు. అండర్ 17 బాలికల విభాగంలో జిల్లాకు చెందిన జయ మనోజ్ఞ క్రికెట్లో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు అర్హత సాధించింది. అండర్ 17 బాలికల క్రికెట్ టోర్నమెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ టోర్నమెంట్లో జయ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో ప్రతిభ
సిరికొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో సిరికొండ సత్యశోధక్ పాఠశాలకు చెందిన యుగేశ్వరి, మేఘన ప్రతిభ కనబర్చారని ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోశించి బంగారు పతకాలు సాధించారన్నారు. వీరిని సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగామోహన్, జక్రాన్పల్లి ఎంఈవో శ్రీనివాస్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్, ప్రిన్సిపాల్ నర్సయ్య అభినందించారు.


