అద్దాల మేడలో కొనసాగుతున్న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేక రోగులతోపాటు వారి సహాయకులు, వైద్యులు, సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. అద్దాలు పగిలిపోవడంతో వాటికి అడ్డంగా చీరలు కట్టుకుంటున్నారు. ఒకటి, రెండో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో మూడు, నాల్గో లిఫ్ట్‌ల వద్ద రోగులు, వారి సహాయకులు బారులు తీరుతున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగాలేక గోడల వెంబడి మురుగునీరు ప్రవహిస్తూ దుర్గంధం వ్యాపిస్తోంది. వైద్య సేవలు బాగానే ఉన్నా సౌకర్యాలు మాత్రం కరువయ్యాయని జీజీహెచ్‌కు వస్తున్న వారు పెదవి విరుస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


