నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

బోధన్‌రూరల్‌ : సమీకృత పాఠశాల భవన సముదాయ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. రూ.200 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌లో విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరతగతి వరకు చదువుతోపాటు వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. టీచింగ్‌ స్టాఫ్‌కు కూడా పాఠశాల భవన సముదాయంలో సౌకర్యం ఉంటుందన్నారు. పనుల్లో వేగం పెంచి వచ్చే జూన్‌, జూలైలో పాఠశాలను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ తూము శరత్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగేశ్వర్‌రావు, టీపీసీసీ డెలిగెట్‌ బి. గంగాశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాదవ్‌ కృష్ణ, తహసీల్దార్‌ విఠల్‌ తదితరులున్నారు.

రేపు జిల్లాకు

రాష్ట్ర బీసీ కమిషన్‌

● బహిష్కరణ ఘటనలపై బాధితులతో భేటీ కానున్న చైర్మన్‌, సభ్యులు

నిజామాబాద్‌అర్బన్‌ : సామాజిక బహిష్కరణ ఘటనలపై బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ ఈ నెల 7న జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి తెలిపారు. కమిషన్‌ చైర్మన్‌ జి.నిరంజన్‌, సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, డా. బాలలక్ష్మిలు సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకోనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 7న కలెక్టరేట్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కమిషన్‌ ప్రతినిధులు ఫిర్యాదులను స్వీకరిస్తారని తెలిపారు. కాగా, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు కలెక్టర్‌, సీపీ, సంబంధిత అధికారులతో కమిషన్‌ సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో బహిష్కరణ సమస్య ఎదుర్కొన్న 23 గ్రామాలు,ప్రాంతాల బాధితులను హాజరుపరచాలని కమిషన్‌ సూచించినట్లు సమాచారం.

రెడ్‌క్రాస్‌ చైర్మన్‌గా

లక్ష్మీనారాయణ

నిజామాబాద్‌అర్బన్‌ : రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా పోతనకర్‌ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి, డీసీవో శ్రీనివాస్‌ ఎన్నికై న సభ్యులతో సోమవారం ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బుస్సా ఆంజనేయులు, నరాల సుధాకర్‌, సత్యప్రసాద్‌ రవీందర్‌, జగన్మోహన్‌ గౌడ్‌, యాదగిరి, బాలాజీ, సుభాష్‌, రవీందర్‌, రంజిత్‌, నాగరాజ్‌ తదితరులు ఉన్నారు.

కొనసాగుతున్న

‘సాగర్‌’ నీటి విడుదల

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు రెండో విడత నీటి విడుదల కొనసాగుతోంది. సోమవారం ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,800 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. సోమవారం సాయంత్రానికి 1,399.81 అడుగుల (11.161 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement