విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి

Oct 6 2026 1:06 AM | Updated on Oct 6 2026 1:06 AM

● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి

● ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

● పాల్గొన్న రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

ఖలీల్‌వాడి/నిజామాబాద్‌ అర్బన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్‌ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లోని కాన్ఫరె న్స్‌ హాల్‌లో సోమవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉ పాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ను సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల తో పోలిస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వ ర్తిస్తున్న ఉపాధ్యాయులు మెరుగైన బోధనా సామర్ధ్యం, నైపుణ్యాలు కలిగి ఉన్నారని అన్నారు. పేద కుటుంబాల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి రూ. కోట్లు వెచ్చిస్తూ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు. జిల్లాలో ని ప్రభుత్వ బడులలో మరుగుదొడ్లు, మూత్రశాలల కోసం రూ.21 కోట్ల నిధులను వెచ్చించామన్నారు. విద్యా రంగంలో జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆర్‌.భూపతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సబ్జెక్టులతోపాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, ధ్యానం, యోగా వంటి అంశాలను కూడా నేర్పించాలని సూచించారు. కలెక్టర్‌ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఆధునిక పద్ధతుల్లో బోధన చేయాలని హితవు పలికారు. అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా తగిన గుర్తింపు లభిస్తుందని, విధులలో అలసత్వ ధోరణిని ప్రదర్శించే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గీత కార్మిక పారిశ్రామిక సంఘం చైర్మన్‌ శేఖర్‌ గౌడ్‌, డీఈవో అశోక్‌, డీఐఈవో రవికుమార్‌, డీసీఈబీ సెక్రెటరీ సీతయ్య, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement