ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్‌ పీజీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్‌ పీజీ పరీక్షలు

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

తెయూ(డిచ్‌పల్లి):తెలంగాణ యూనివర్సిటీలోని ఐ దు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ (ఏపీఈ, ఐపీ సీహెచ్‌, ఐఎంబీఏ) 4, 5వ సెమిస్టర్లు, ఏపీఈ, ఐపీసీహెచ్‌ 7, 9వ సె మిస్టర్ల బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు ఐదుగురు విద్యార్థులకు గాను నలుగురు హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యా హ్నం జరిగిన పరీక్షలకు 12 మంది విద్యార్థులకు 10 మంది హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు తెలిపారు.

25 నుంచి బీపెడ్‌ ప్రాక్టికల్స్‌..

తెలంగాణ వర్సిటీ పరిధిలోని బీపెడ్‌ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌, 1, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

25 నుంచి బీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు..

తెలంగాణ వర్సిటీ పరిధిలోని బీఈడీ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1, 2, 3, 4వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఈ నెల 25 నుంచి ఆగస్ట్‌ 14 వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌ తెలిపారు.

ఆగస్టు 3 నుంచి బీటెక్‌ సెమిస్టర్‌ పరీక్షలు..

తెయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని బీటెక్‌ (సీఎస్‌ఈ, ఏఐ) 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు ఆగస్టు 3 నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే.సంపత్‌కుమార్‌ తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www. telanganauniversity. ac. in ను సందర్శించాలని ఆయన సూచించారు.

కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు

తెయూ పరిధిలో కొనసాగుతున్న ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 39 మంది విద్యార్థులకు గానూ 35 మంది హాజరుకాగా నలుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు ఏడుగురు విద్యార్థులకు గానూ ఆరుగురు హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు.

డిగ్రీ వన్‌టైం చాన్స్‌ పరీక్షలకు 28 మంది గైర్హాజరు

తెయూ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ 1, 2, 3, 4, 5, 6వ సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ వన్‌టైం చాన్స్‌ పరీక్షల్లో సోమవారం 28 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అకడమిక్‌ ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 94 మంది విద్యార్థులకు గానూ 73 మంది హాజరుకాగా 21 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 90 మంది విద్యార్థులకు గానూ 83 మంది హాజరుకాగా ఏడుగురు గైర్హాజరైనట్లు తెలిపారు.

బీఈడీ, బీపెడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు

తెయూ పరిధిలో కొనసాగుతున్న బీఈడీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బీపెడ్‌ 1, 2, 3, 4వ సెమిసర్ల బ్యాక్‌లాగ్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్‌ ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 50 మంది విద్యార్థులకు గానూ 41 మంది హాజరుకాగా తొమ్మిది మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,499 మంది విద్యార్థులకు గానూ 1,433 మంది హాజరుకాగా 66 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement