ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

పెర్కిట్‌(ఆర్మూర్‌): వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ శివాలయం వద్ద ఏర్పాటు చేసిన వరి ధా న్యం కొనుగోలు కేంద్రంలో వారు ఆందోళనకు ది గారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం ఎక్కడికక్క డ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వెంటనే తరుగు తీయకుండా కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. పెర్కిట్‌ సొసైటీ మాజీ చైర్మన్‌ నచ్చు చి న్నా రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాలెపు రాజు, నాయకులు అల్లూరి గంగారెడ్డి, రైతులు ఎన్నారు.

దొడ్డురకం కొనుగోలు చేయాలంటూ..

మోపాల్‌: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డురకం ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శనివారం మోపాల్‌ మండలకేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేల్పూర్‌ భూమయ్య, మోపాల్‌ సర్పంచ్‌ ద్యాప రవి, అగ్గు చిన్నయ్య మాట్లాడుతూ.. మిల్లర్లు, సివిల్‌ సప్లయ్‌ అధికారులు కుమ్మకై ్క రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేయాలని, లేకపోతే రైతులతో కలిసి చలో కలెక్టరేట్‌కు చేపడుతామని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement