‘బాల భరోసా’ను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘బాల భరోసా’ను సద్వినియోగం చేసుకోవాలి

May 2 2026 12:07 PM | Updated on May 2 2026 12:07 PM

డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజశ్రీ

సుభాష్‌నగర్‌: ఐదేళ్లలోపు పిల్లల అభివృద్ధిలో లోపా లు, నాడీ సంబంధిత సమస్యలు, శారీరక వైకల్యా న్ని ముందుగానే గుర్తించడానికి ఉద్దేశించిన బాల భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీ ఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. కార్యక్రమం వి జయవంతం చేసేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ, ఆరోగ్యశాఖ సమన్వయంతో పని చేయాలని పే ర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరంలోని జీజీహెచ్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవజాత శిశువు నుంచి 18 ఏళ్ల పిల్లలందరికీ రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో భాగంగా మొబైల్‌ హెల్త్‌ టీమ్స్‌ ద్వారా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా హెల్త్‌ స్క్రీనింగ్‌ చేయించాలన్నా రు. ఏమైనా సమస్యలున్న విద్యార్థులను జీజీహె చ్‌లోని జిల్లా ఎర్లీ ఇంటర్వేన్షన్‌ కేంద్రంలో స్పీచ్‌, ఫిజియోథెరపీలు, చికిత్సలు ఉచితంగా అందిస్తా మని తెలిపారు. పుట్టుకతో వచ్చే లోపాలు, దంత, కంటి సమస్యలు, అనీమియా, పోషకాహార లో పాలు, గుండె సంబంధిత వ్యాధులు, అన్నిరకాల శస్త్ర చికిత్సలు, చర్మ తదితర వ్యాధులకు చికిత్సలు చేయిస్తామని పేర్కొన్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి నుంచి పూర్తి సహకారం ఉంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమోహన్‌రావు తెలిపారు. పాఠశాలలు తెరిచిన తర్వాత ఆర్‌బీఎస్‌కే టీములు స్క్రీనింగ్‌ చే యడానికి అంగన్‌వాడీ టీచర్లు సహకరించాలని డి స్ట్రిక్ట్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అశోక్‌ కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిణి పద్మ, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, మెడికల్‌ హెల్త్‌ టీమ్‌లు, ఆర్‌బీఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement