ప్రచార పరుగు!
ఎన్‌ఎంసీ బరిలో 350 మంది
● 298 నామినేషన్‌ల ఉపసంహరణ
సుభాష్‌నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 60 డివిజన్‌లలో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు కలుపుకుని మొత్తం 350 మంది నిలిచారు. మంగళవారం 3 గంటల వర కు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 298 మంది నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. నామినేషన్‌లు ఉపసంహరించుకు న్న వారిలో కాంగ్రెస్–128, బీజేపీ–97, బీఆర్‌ఎస్–20, ఎంఐఎం–21, స్వతంత్రులు–24, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు–8 మంది ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ తెలిపారు. అలా గే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల గుర్తులు కేటాయించడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. గుర్తులతో ప్రజల్లోకి వెళ్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఆర్మూర్‌లో 153.. బోధన్‌లో 162..
భీమ్‌గల్‌లో 49 మంది..
నామినేషన్‌ల ఉపసంహరణ అనంతరం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులకు 153 మంది బరిలో మిగిలారు. అలాగే బోధన్‌లో 38 వార్డులకు 162 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు 38 వార్డుల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాయి. భీమ్‌గల్ పట్టణంలో 12 వార్డుల్లో 49 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో మున్సిపల్ ఎన్నికల బరిలో నిలబడిన ఆయా పార్టీల అభ్యర్థులు తక్షణమే ప్రచారాన్ని మరింత స్పీడ్ చేశారు. ప్రచారానికి కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు ఓటర్లను పూర్తి స్థాయిలో కలిసేందుకు ఆయా డివిజన్లు, వార్డుల్లో ఊపిరి సలపని స్థాయిలో ప్రచారంలోకి దిగారు. ఈ నెల 9 వరకు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా హైరానా పడుతున్నారు.
● నిజామాబాద్ మేయర్ స్థానంపై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అనేస్థాయిలో హోరాహోరీగా తలపడుతున్నా యి. ఎంఐఎం సైతం తన పట్టును నిలబెట్టుకునేందుకు ప్ర ణాళికలు రచించి ముందుకు వెళుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థులు కింగ్‌మేకర్ కావాలనే లక్ష్యంతో పరుగు లు తీస్తున్నారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కవిత అనుచరులు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గు ర్తుపై బరిలోకి దిగారు. నిజామాబాద్ నగరంలో మొత్తం అన్ని పక్షాలకు సంబంధించి 298 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివ రకు 60 డివిజన్లలో కలిపి 350 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కంటే మూ డు రోజులు ముందుగానే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ మాత్రం చివరి రోజున ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల వి షయమై సుదీర్ఘ ఉత్కంఠ నడిచింది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు ముందుగానే ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు బుధ వారం నుంచి ప్రచారంలోకి దిగుతున్నారు. కాగా చివరి వరకు ప్రయత్నించినప్పటికీ టికెట్టు రాని అసంతృప్తులు ఏమేరకు గెలుపోటములను ప్రభావితం చేస్తారనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో ఉంది.
● ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలు నిజామాబాద్ మేయర్ పదవిని దక్కించుకునే విషయంలో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డిలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మేయర్ అభ్యర్థులు కాటిపల్లి శమంతరెడ్డి, గోపిడి స్రవంతిరెడ్డి తమ డివిజన్లలో గెలుపొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఉపసంహరణలు పూర్తి కావడంతో
గ్రౌండ్‌లోకి అభ్యర్థులు
సమయం తక్కువగా ఉండడంతో
ప్రధాన పార్టీల హడావుడి
6న జిల్లాలో సీఎం పర్యటనపై
కాంగ్రెస్ ఆశలు
ముందుగానే
రంగంలోకి దిగిన బీజేపీ
ప్రచార పరుగు!


