ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం | - | Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం

Feb 4 2026 7:01 AM | Updated on Feb 4 2026 7:01 AM

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం

ఆర్మూర్‌ కాంగ్రెస్‌లో ధిక్కార స్వరం

బీ ఫామ్‌లు అమ్ముకున్నారని ఆరోపణ

ఇద్దరు నాయకులు వార్డులను

పంచుకున్నారు

పార్టీ అభ్యర్థులను ఓడిస్తామన్న రెబల్స్‌

ఆర్మూర్‌: టికెట్‌లు ఆశించి భంగపడిన వారు ఆ ర్మూర్‌ కాంగ్రెస్‌లో ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నా రు. పార్టీ అభ్యర్థుల తరఫున బీఫామ్‌లను కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల అధికారులకు అందజేయడంతో టికెట్‌ రాని వారు ఒక్కసారిగా అసంతృప్తిని వె ల్లగక్కారు. ఒక్కొక్కరుగా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్‌ నాయకత్వంపై దుమ్మెత్తి పో స్తున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్‌(చిన్న), పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి పట్టణంలోని 36 వార్డులను పంచుకొని తమ అనుచరులకు మాత్రమే బీ ఫామ్‌లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని 2వ వార్డు నుంచి వనం శేఖర్‌, 3వ వార్డు నుంచి పూల నర్సయ్య, 13వ వార్డు నుంచి కన్న లక్ష్మణ్‌, 14వ వార్డు నుంచి ఇంతియాజ్‌, 19వ వార్డు నుంచి విజయ్‌ అగర్వాల్‌, 20వ వార్డు నుంచి ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్న, 27వ వార్డు నుంచి మాజీ కౌన్సిలర్‌ అతిక్‌ కాంగ్రెస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డారు. ఆయా వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ని లుస్తామని, కాంగ్రెస్‌ అభ్యర్థులను ఓడించి ఆ వా ర్డుల్లో తమ బలాన్ని ప్రదర్శిస్తామని అంటున్నారు.

ఓడించి తీరుతాం

తమను నమ్మించి మోసం చేశారని, కాంగ్రెస్‌ అభ్యర్థులపై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి వారిని ఓడించి తీరుతామని రెబల్స్‌ వనం శేఖర్‌, విజయ్‌ అగర్వాల్‌, పూల నర్సయ్య, కన్న లక్ష్మణ్‌ అన్నారు. పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌ వారు మీడియాతో మాట్లాడారు. ఇన్ని రోజులుగా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్న తమను కాదని కనీసం పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీ ఫామ్‌లు అమ్ముకున్నారని ఆరోపించారు. తాము చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి స్వతంత్రులుగా బరిలో ఉంటున్న తమను గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement