పుష్కరఘాట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

పుష్కరఘాట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Feb 4 2026 7:01 AM | Updated on Feb 4 2026 7:01 AM

పుష్క

పుష్కరఘాట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

నవీపేట: మండలంలోని యంచ శివారులోని గోదావరి నది ఒడ్డున పుష్కర ఘాట్‌ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం స్థలాన్ని పరిశీలించారు. యంచ శివారులో పుష్కర ఘాట్‌ను నిర్మించాలని శ్రీ ఓం జగదాద్రి ట్రస్టు ప్రతినిధులు, వీడీసీ ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డితోపాటు కలెక్టర్‌ను కోరవడంతో స్థలాన్ని పరిశీలించాలని వారు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయరామారావు నది ఒడ్డున ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉండడంతో నివేదికలను అధికారులను అందజేస్తామన్నారు. సర్పంచ్‌ బేగరి సాయిలు, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, వీడీసీ ప్రతినిధులు రాజేశ్వర్‌, కొట్టాల ప్రవీణ్‌, చింటూ, చంద్ర లక్ష్మణ్‌, ట్రస్ట్‌ ప్రతినిధులు సురేశ్‌, రమేశ్‌ తదితరులు ఉన్నారు.

14న నీట్‌, ఐఐటీ,

సీఏ ప్రవేశ పరీక్ష

ఖలీల్‌వాడి : నాగారంలోని తెలంగాణ మైనారిటీ బాలుర జూనియర్‌ కళాశాలలో ఐఐటీ, నీట్‌, క్లాట్‌, సీఏ ఉచిత కోచింగ్‌కు ఈ నెల 14న ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్‌ సయ్యద్‌ హైదర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోచింగ్‌తోపాటు ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపులలో అడ్మిషన్‌ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి ఈ నెల 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

కాంగ్రెస్‌ అఫీషియల్‌ వ్యవహారాల

ప్రతినిధిగా గన్‌రాజ్‌

నిజామాబాద్‌ రూరల్‌: టీపీసీసీ ప్రె సిడెంట్‌ బొమ్మ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఎన్నికల కాంగ్రెస్‌ పార్టీ అఫీషి యల్‌ వ్యవహారాల ప్రతినిధిగా కాపుకర్‌ గన్‌రాజ్‌ నియామకం అయ్యారు. నిజామాబాద్‌ కా ర్పొరేషన్‌తోపాటు మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల స మస్యలను గన్‌రాజ్‌ నివృత్తి చేయనున్నారు. కాంగ్రెస్‌ కమిటీ తరఫున ఎలక్షన్‌ కమిషన్‌కి వా రధిగా, కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఎలక్షన్స్‌కి సంబంధించిన అఫీషియల్‌ వ్య వహారాలు, ఎలక్షన్‌ కమిషన్‌తో సంప్రదింపులు, తదితర సమస్యల ను గన్‌రాజ్‌ దృష్టికి తీసుకురావాలని కోరారు.

హుండీ ఆదాయం లెక్కింపు

బోధన్‌: ఎడపల్లి మండలంలోని జానకంపేట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బ్రహ్మమోత్సవాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.93 వేల 667 నగదు ఆదాయం సమకూరిందని ఈవో వేణు తెలిపారు. అలాగే ప్రత్యేక పూజలు, తైబజార్‌ కలుపుకుని మొత్తం రూ.2లక్షల 8 వేల 951 ఆదాయం సమకూరిందని వివరించారు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

పుష్కరఘాట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన 1
1/1

పుష్కరఘాట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement