వలస కార్మికుల గోస తీరేనా..! | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల గోస తీరేనా..!

Feb 4 2026 7:01 AM | Updated on Feb 4 2026 7:01 AM

వలస క

వలస కార్మికుల గోస తీరేనా..!

సంక్షేమ బాధ్యత రాష్ట్రాలపైనే...

ఆందోళన తప్పదు

దురదృష్టకరం..

మోర్తాడ్‌(బాల్కొండ) : వేల్పూర్‌ మండలం పచ్చల నడ్కుడకు చెందిన బొమ్మకంటి అరవింద్‌ గౌడ్‌(35) గత నెల జనవరి 7న టర్క్స్‌ అండ్‌ కై కోస్‌ ఐలాండ్స్‌–టీసీఐ(బ్రిటీష్‌ ఓవర్సీస్‌ టెరిటరీ)లో ఆకస్మికంగా మరణించాడు. అతని కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల సాయం అరవింద్‌ కుటుంబానికి అందే అవకాశం లేదు. కే వలం గల్ఫ్‌ దేశాల్లో మరణించినవారికే రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న సాయం వర్తిస్తుంది. కేంద్ర ప్రభు త్వం ఏదైనా సంక్షేమ పథకం అమలు చేసి ఉంటే ఎంతో కొంత అరవింద్‌ కుటుంబానికి చేయూత అందేది. రాష్ట్ర ప్రభుత్వం తన సాయాన్ని గల్ఫ్‌ దే శాల వలస కార్మికులకే పరిమితం చేయడం, కేంద్రం ఎలాంటి పథకాలను అమలు చేయకపోవడంతో అరవింద్‌లాంటి ఎన్నో బాధిత కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షలా మారాయి.

వలస కార్మికులతో కేంద్రానికి ఆదాయం లభిస్తున్నా వారి బాగు కోసం ఎలాంటి కేటాయింపులు లేకుండానే బడ్జెట్‌ ప్రసంగం ముగియడం తీవ్ర నిరాశను మిగిల్చింది. గత ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విదేశీ వ్యవహారాల కోసం రూ.22,119 కోట్లను కేటాయించింది. ఈ నిధులలో కొంత మొత్తం ఆయా దేశాలకు సాయంగాను మరికొంత సంయుక్త ప్రాజెక్టుల కోసమే వినియోగించనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. విదేశాంగ శాఖకు కే టాయించిన నిధులలో కొంతైనా ఆయా దేశాల రాయబార కార్యాలయాల ద్వారా భారతీయ వలసదారులకు న్యాయ సహాయం ఇతర సౌకర్యాలను కల్పించడానికి వినియోగిస్తే మేలు అని పలువురు సూచిస్తున్నారు. కేంద్రం మాత్రం తన బడ్జెట్‌లో వలస కార్మికుల అంశంను అసలే ప్రస్తావించలేదు.

కేంద్రం బాటలోనే రాష్ట్రాలు..

వలస కార్మికుల విషయంలో కేంద్రం అనుస రిస్తున్న విధానాన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. వలస కార్మికుల ద్వారా వచ్చే ఆదాయంపై చూపుతున్న ఆసక్తిని వారి మంచి చెడుల కోసం కనబరచకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. వలస కార్మికులు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారికి పునరావాసం, పునరేకీకరణ చర్యలు తీసుకోకపోవడంతో అనేక మంది మానసిక క్షోభకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు నిర్లక్ష్యం వ హిస్తున్నాయి. రైతు ఉ ద్యమాల మాదిరిగానే వలస కార్మికుల కు టుంబాలతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాల్సి వస్తుంది. – గుగ్గిల్ల రవిగౌడ్‌,

గల్ఫ్‌ జేఏసీ చైర్మన్‌

కేంద్ర బడ్జెట్‌లో వలస కార్మికుల సంక్షేమం కోసం కేటా యింపులు జరుపకపోవడం దురదృష్టకరం. వలసదారులతో వచ్చే ఆదాయం అవసరం ఉంది. కానీ వారి మంచి కోరే చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదు. ప్ర భుత్వాలు పునరాలోచన చేయాలి. – స్వదేశ్‌ పరికిపండ్ల,

ప్రవాసీ మిత్ర లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు

విదేశాల్లో వ్యాపారం, ఉద్యోగం చేస్తూ వలసదారులు ఆర్జిస్తున్న మొత్తంలో ఖర్చులు పోను మిగిలిన సొమ్మును భారతదేశానికే పంపిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల పౌరులకన్నా భారతీ యులే అత్యధికంగా విదేశీ మారకద్రవ్యాన్ని పంపిస్తున్న జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. 2025లో రూ.10.25లక్షల కోట్ల ధనాన్ని చేరవేశా రు. కేంద్ర బడ్జెట్‌కు రూ.1,10,700 కోట్లను విదేశాల్లో ఉన్న మన దేశ పౌరులు అందించారు. అ యినా వలసదారుల సంక్షేమం బాధ్యతను కేంద్రం రాష్ట్రాలకే అప్పగించి చేతులు దులుపుకుందనే విమర్శ వ్యక్తమవుతోంది. గల్ఫ్‌ బోర్డును ఏ ర్పాటు చేయాలని వలస కార్మికులు డిమాండ్‌ చేస్తున్నా ఉలుకుపలుకు లేకుండా పోయింది.

ఆదాయం ఉన్నా... కేటాయింపులు సున్నా..

కేంద్ర బడ్జెట్‌లో వలస కార్మికుల

సంక్షేమంపై ఊసెత్తకపోవడంతో

సర్వత్రా నిరసన

రెమిటెన్స్‌లలో మొదటిస్థానంలో

నిలిచినా వలసదారులకు అన్యాయమే

వలస కార్మికుల గోస తీరేనా..!1
1/2

వలస కార్మికుల గోస తీరేనా..!

వలస కార్మికుల గోస తీరేనా..!2
2/2

వలస కార్మికుల గోస తీరేనా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement